దేశ ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్ జిల్లాలో పర్యటించారు. అక్కడ పార్వతి కుండ్‌కు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా, ఈ రోజు ప్రధాని మోడీ ఉత్తరాఖండ్‌లో దాదాపు రూ.4,200 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.