కొందరు బీజేపీ నేతలు చంద్రబాబుకు మద్దతిస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. పురందేశ్వరి విషయంలో తాము చెప్పిందే జరిగిందని పేర్కొన్నారు. టీడీపీ ఖాతాలోకి రూ.27కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. చంద్రబాబు 'నేను అవినీతికి పాల్పడలేదు' అని చెప్పటం లేదని.. టీడీపీ హయాంలో ఆటవిక రాజ్యం నడిచిందని వ్యాఖ్యానించారు.