13 ఏళ్ల మైనర్ బాలికను దారుణంగా హతమార్చిన ఘటన ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో చోటు చేసుకుంది. స్కూల్కు వెళ్లిన బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక చెరుకు తోటలో శవమై కనిపించింది. బాలిక కళ్లు బయటకు పీకి చిత్రహింసలు గురిచేసినట్లు తెలిసింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.