బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ హౌసింగ్ స్కీం లంచం తీసుకున్న కేసులో యడ్యూరప్పకు మరో షాక్ తగిలింది. సీఎం పై దాఖలు చేసిన FIR ను తిరస్కరించాలన్న తమ అభ్యర్థనను పరిశీలిస్తామని కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. సీఎం తరపున వాదించిన సీనియర్ లాయర్ సిద్ధార్థ లూత్రా ఇది కేవలం రాజకీయ కుట్రనేనని వాదించారు. 3 వారాల తర్వాత ఈ అంశాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం పేర్కొంది.