నేడు కాకినాడ జిల్లా సామర్లకోట లో సీఎం జగన్ పర్యటించనున్నారు. పేదలకు నిర్మించిన గృహాల సామూహిక గృహప్రవేశ కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టనున్నారని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా వెల్లడించారు. బుధవారం రాత్రి సామర్లకోటలో కాలనీ గృహాలను రాష్ట్ర హౌసింగ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్, ముఖ్యమంత్రి పర్యటన సమన్వయకర్త తలశిల రఘురామ్, హౌసింగ్ జేఎండీ శివప్రసాద్, కలెక్టర్ కృతికాశుక్లా, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు, ఎస్పీ సతీష్‌కుమార్‌తో కలిసి సందర్శించారు. ముఖ్యమంత్రి కాన్వాయ్‌కు సంబంధించిన ట్రైల్ రన్‌ను హెలీప్యాడ్ నుంచి ఈటీసీ లేఅవుట్ వరకూ నిర్వహించారు.