తనపై నమోదు చేసిన స్కిల్ స్కాం కేసు కొట్టేయాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరగనుంది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు కేసు విచారణ చేయనుండగా.. సెక్షన్ 17ఏ బాబుకు వర్తిస్తుందా లేదా అనేది ధర్మాసనం తేల్చనుంది. చంద్రబాబు తరఫున సాల్వే, సీఐడీ తరఫున రోహత్గ, రంజిత్ కుమార్ వాదనలు వినిపించనున్నారు. ఫైబర్నెట్ స్కాంలో బాబు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై కూడా విచారణ జరగనుంది.