ఒక దేశ కరెన్సీని మరో కరెన్సీతో మార్పిడి చేసే రేటునే ఫారెక్స్ రేటు అంటారు. విదేశీ ప్రయాణం చేయాలన్నా.. విదేశాల్లో ఉన్న వారికి డబ్బు పంపాలన్నా.. మీకు విదేశీ కరెన్సీ అవసరం. బ్యాంకులు ట్రావెల్ అగ్రగేటర్స్‌తో పాటు మనీ ఛేంజర్స్ కూడా ఈ కరెన్సీ ఎక్స్‌ఛేంజ్ చేస్తాయి. ఈ ఎక్స్‌ఛేంజ్ రేటు ఫిక్స్‌డ్ లేదా ఫ్లోటింగ్ ఉండవచ్చు. ఫిక్స్‌డ్ రేటుని ఆర్‌బీఐ నిర్దేశిస్తుంది. ఫారెక్స్ రేట్ డిమాండ్‌ని బట్టి ఉంటుంది.