స్కిల్ డెవలప్మెంట్ కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఉండవల్లి వేసిన పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించగా.. ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. కేసును సీఐడీ నుంచి సీబీఐకి ఇవ్వాలని ఉండవల్లి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.