స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో జైల్లో చంద్రబాబు ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని చంద్రబాబు కోడలు నారా బ్రహ్మణి ట్విట్టర్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబును అపరిశుభ్రమైన జైల్లో నిర్బంధించడం హృదయవిదారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చంద్రబాబు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. చంద్రబాబు క్షేమం గురించి వైద్యనిపుణులు ఆందోళన వ్యక్తం చేసినందున ఆయనకు తక్షణ వైద్య సహాయం అవసరమన్నారు. చంద్రబాబుకు సకాలంలో వైద్యం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు 5 కేజీల బరువు తగ్గడం ఆయన కిడ్నీలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని అన్నారు. చంద్రబాబు ఆరోగ్యం గురించి కుటుంబసభ్యులమంతా తీవ్ర ఆందోళన చెందుతున్నామని నారా బ్రహ్మణి ట్వీట్ చేశారు.