సీఎం జగన్ చేసే పనులను బట్టి జగన్‌కు సైకో బిరుదు వచ్చిందని మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. జగన్ పాలనలో రాష్ట్రమంతా గంజాయి వ్యాపించిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ప్రజాస్వామ్యం కాపాడాలని కోరారు. 16 నెలలు జైలులో ఉన్న జగన్ ముఖ్యమంత్రి అయ్యారని... ఆ ఆలోచనతోనే ప్రతిపక్ష నేతలను జైలులో పెట్టడం ... మంత్రులు చొక్కాలు ఇప్పడం లాంటివి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పట్లో ఎన్టీఆర్‌పై అభియోగాలు వచ్చినా లెజిస్లేటివ్ కమిటీ మూడేళ్ల పాటు విచారణ జరిపించిందని.. అభియోగాలపై ఎన్టీఆర్‌ను అప్పట్లో జైలులో పెట్టలేదని అన్నారు.