జిల్లా పరిధిలో పన్నులు కట్టకుండా నిర్బంధంలో ఉన్న 66 వాహనాలకు బహిరంగ వేలం నిర్వహించారు. వేలంపాటలో రూ. 16, 49, 300 ఆదాయం వచ్చినట్లుగా జిల్లా ఉప రవాణా కమిషనర్ సుశీల గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఒంగోలులోని ఆర్టీవో కార్యాలయంలో కమిషనర్ మాట్లాడుతూ ఈ వేలంపాటలో 50 మంది పాటదారులు పాల్గొని వాహనాలను దక్కించుకున్నారని తెలిపారు. ప్రజలు తమ వాహనాలకు పన్నులు సకాలంలో చెల్లించాలన్నారు.