ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కందుకూరు లోని అంకమ్మ తల్లి అమ్మవారికి ఆలయ అర్చకులు శుక్రవారం అభిషేకం నిర్వహించారు. అభిషేకం అనంతరం కన్నుల పండుగగా అమ్మవారిని అలంకరించారు. అభిషేకంలో పాల్గొన్న భక్తులకు, ఆలయానికి విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పబ్బిశెట్టి శివ మాట్లాడుతూ. అంకమ్మ తల్లి అనుగ్రహంతో అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.