జైల్లో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని కోడలు, లోకేష్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. అపరిశుభ్రమైన నీరు, బరువు తగ్గడం, ఇన్ఫెక్షన్లు, ఎలర్జీలతో చంద్రబాబు సతమతమవుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ డాక్టర్లు, అధికారులు ఏం దాచాలని చూస్తున్నారని ప్రశ్నించారు. బాబుకు ఏం జరిగినా జగన్ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.