దోచుకునేవాడు, దాచుకునేవాడు సీఎం అయితే రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంటుందో ఎపీని చూస్తే అర్థమవుతుందని జనసేన కడప నియోజకవర్గ ఇంచార్జ్ సుంకర శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం కడప నగరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో వారు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వివిధ రకాల పోస్టర్లను ఆవిష్కరించారు. విషయం, సరుకు లేని వ్యక్తి సీఎం కావడం దౌర్భాగ్యం, దురదృష్టకరం అని అన్నారు. జనసేన నేతలు పాల్గొన్నారు.