వెదురుకుప్పం మండలం జక్కదన గ్రామంలో శుక్రవారం అంగన్వాడీ ఆధ్వర్యంలో నిర్వహించిన పౌష్టికాహార కేంద్రాలను ఎంపీపీ బండి నాగరాణి పరిశీలించారు. గర్భిణీ స్త్రీలకు మెరుగైన పౌష్టికాహారం అందించడంలో సిబ్బంది చేస్తున్న కృషిని అభినందించారు. అంగన్వాడీ కేంద్ర సిబ్బంది మాతా శిశు సంక్షేమం కోసం అందిస్తున్న సేవలు, పిల్లలకు అందిస్తున్న వ్యాధి నిరోధక టీకాల ప్రభావం వల్ల ఆరోగ్యకరమైన వాతావరణం క్షేత్రస్థాయిలో ఏర్పడుతుందని తెలిపారు.