అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో చంద్రబాబుకు హైకోర్టులో తాత్కాలికంగా స్వల్ప ఉపశమనం లభించింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంటుపై విచారణ ప్రక్రియను న్యాయస్థానం ఈ నెల 16 వరకూ నిలుపుదల చేసింది. పీటీ వారెంటు విషయంలో ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయవద్దని ఏసీబీ కోర్టుకు స్పష్టం చేసింది. పీటీ వారెంటు విధానంలో తప్ప జ్యుడీషియల్ కస్టడీలోఉన్న పిటిషనర్‌ను నేరుగా అరెస్టు చేసే ఉద్దేశం లేదని సీఐడీ తరఫున అడ్వకేట్ జనరల్(ఏజీ) ఎస్.శ్రీరామ్ లిఖితపూర్వకంగా సమర్పించిన హామీని న్యాయస్థానం రికార్డుచేసింది. విచారణను16వ తేదీకి వాయిదా వేసింది. ఇక నేడు అంగళ్లు కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ లభించడంలో టీడీపీ శ్రేణులు ఆనందంలో మునిగి తేలుతున్నాయి.