కాకినాడ జిల్లా టీడీపీ సీనియర్ నేత గుణ్ణం చంద్రమౌళి కార్యాలయంలో ఐటీ అధికారుల సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. మౌళి కార్యాలయంలో డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌ను అధికారులు పరిశీలిస్తున్నారు. ఫోరెన్సిక్ నిపుణుల ద్వారా హార్డ్ డిస్కుల్లో డేటా సేకరించే పనిలో పడ్డారు. మరోపక్క కాకినాడ స్మార్ట్ సిటీలో చేసిన రోడ్డు పనులు, ఎం బుక్ వివరాలను ఐటీ సిబ్బంది పరిశీలిస్తోంది. తమ వ్యాపారాలకు సంబంధించి రిటర్ల్ను వేసి సక్రమంగా పన్ను చెల్లిస్తున్నట్లు ఐటీ అధికారులకు మౌళి వివరించారు. నారా లోకేష్‌కు చంద్రమౌళి బినామీ అంటూ ఓ వర్గం మీడియా ప్రచారంపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీకి ఆర్థికంగా అండగా ఉన్న నేతలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడంపై పార్టీ నేతలు మండిపడుతున్నారు.