ఆటో కార్మికులకు శాపంగా మారిన జీవో నెంబరు 21, 31ని రద్దు చేయాలని ఏఐటీయూసీ కర్నూలు జిల్లా కార్యదర్శి ఎస్.మునెప్ప డిమాండ్ చేశారు. గురువారం జీవోలను రద్దు చేయాలని కోరుతూ ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, ఏఐటీ యూసీ సంయుక్త అధ్వర్యంలో ఏఐటీ యూసీ నగర అధ్యక్షుడు బి.వెంకటేష్ అధ్యక్షతన కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా మునెప్ప మాట్లాడుతూ .... వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆటో కార్మికులకు విపరీతంగా చలానాలు విధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులకు వాహనమిత్ర పథకంలో రూ.10 వేలు ఇస్తూ చలానాల పేరుతో రూ.20 నుంచి రూ.30 వేలు వసూలు చేస్తున్నారన్నారు. డిప్యూటీ కార్యదర్శి కృష్ణయ్య, నగర కార్యదర్శి జి.చంద్రశేఖర్, రాము, ఈశ్వర్‌రెడ్డి, రామాంజనేయులు పాల్గొన్నారు.