విజయనగరం జిల్లా, పాచిపెంట జగనన్న కాలనీలో చోటు చేసుకున్న అక్రమాలపై సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని మండల ప్రాదేశిక సభ్యులు దండి కొండలరావు డిమాండ్ చేశారు. గురువారం పాచిపెంటలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. కొంతమంది నాయకుల స్వార్ధం కోసం అర్హులైన లబ్ధిదారులకు మొండి చెయ్యి చూపి అర్హతలు లేని సంపన్నులకు, ఇప్పటికే పక్కా ఇళ్లు ఉన్న వారికి ఇళ్ల స్థలాలు మంజూరు చేశారని ఆరోపించారు. సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తే వాస్తవాలు తేటతెల్లమవుతాయన్నారు. కాలనీలో అక్రమ కట్టడాలను నివారించాలని చెప్పారు.