ఈనెల 15 నుంచి 23 వరకు జరగనున్న దసరా మహోత్సవాల ఆహ్వాన పత్రికలను విజయవాడ దుర్గగుడి అధికారులు ముఖ్యులకు అందించారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్‌సింగ్ ఠాకూర్, దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కరికాల వేలవన్, దేవదాయ కమిషనర్ ఎస్ సత్యనారాయణకు ఈవో రామారావు, వైదిక కమిటీ సభ్యుడు శంకరశాండిల్య ఆహ్వాన పత్రికలు, ప్రసాదాలను అందజేశారు. అలాగే విశాఖ శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్రకు, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్రకు ట్రస్ట్‌బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, ముఖ్య అర్చకుల బృందం కలిసి ఆహ్వాన పత్రికలు, ప్రసాదాలను అందజేశారు. రాష్ట్ర హోంమంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి తానేటి వనిత, ఉప ముఖ్యమంత్రి, దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణకు గురువారం అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు.