ఒంగోలు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ.... కృష్ణా వాటర్ బోర్డు 5 టీఎంసీల నీటి విడుదలకు ఆదేశించిందని, దీని ద్వారా రాబోయే 10 రోజులలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చెరువులను నింపాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అదేవిధంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కరువుపనులలో ఎటువంటి అవినీతికి తావులేకుండా క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించామన్నారు. వెలుగొండ ప్రాజెక్టు టన్నెల్ 2లో మిగిలిన 500 మీటర్ల పనులను శరవేగంగా పూర్తి చేయటానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు.