జగనన్న సురక్షతో జనానికి ఆరోగ్య రక్ష కలుగుతుందని ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి అన్నారు. మార్కాపురం మండలంలోని కోలభీమునిపాడు, జమ్మనపల్లి, కె.కొత్తపల్లి గ్రామాలలో గురువారం జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..... పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు జగనన్న సురక్షను ప్రవేశపెట్టారన్నారు. ఎంపీడీవో తోట చందన, సర్పంచ్ దండా వెంకటేశ్వరరెడ్డి, వైద్యులు జె.రోహిత్, డి.హరీష్. ఎస్.డేవిడ్, ప్రసన్నరాణి, ఎంపీటీసీలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.