కడప జిల్లా, నిమ్మనపల్లె ప్రభుత్వ కళాశాలో విద్యార్థులకు డ్రగ్స్ వాడితే కలిగే నష్టాల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాల్మీకిపురం ఎస్‌ఐ నాగేశ్వర్‌రావ్ మరట్లాడుతూ..... విద్యార్థులు చెడు మార్గాలకు దూరంగా ఉండాల న్నారు. డ్రగ్స్ బారిన పడి ఎంతో మంది జీవితాలు దుర్భరం అయ్యాయని, వ్యసనాలకు బానిసలుగా కారాదన్నారు. ఎక్కడైనా డ్రగ్స్ విషయం తెలిసిన తక్షణమే సమాచారం ఇస్తే తప్పక చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులు కూడా తమ తల్లిదండ్రు ల కష్టాలు గుర్తుపెట్టుకుని క్రమశిక్షణతో చదువుకుంటూ కళాశాలకు మంచిపేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్‌ఐ కృష్ణమూర్తి, ప్రిన్సిపాల్ ఉమాఅమరేశ్వరి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.