కడప జిల్లా, నిమ్మనపల్లె ప్రభుత్వ కళాశాలో విద్యార్థులకు డ్రగ్స్ వాడితే కలిగే నష్టాల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాల్మీకిపురం డాక్టర్ సనా ఆయోష మాట్లాడుతూ.... ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. యువత మత్తు మందు వాడడం వలన శరీరంలో తెలియని మార్పులు చోటు చేసుకొంటాయన్నారు. ముఖ్యంగా విద్యార్థి దశలోనే మత్తు బానిస అవుతారని తెలిపారు. విద్యార్థులు మత్తు పదార్థాలపై అవగాహనా పెంచుకొని గ్రామాల్లోని ప్రజలకు వాటి పరిస్థితి గురించి వివరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాధారక్షిష్ణ, జలీల్, ఇందుఖేఖర్ తదితరుల పాల్గొన్నారు.