సీఎం జగన్ తన ఆస్తులను రక్షించుకోవడానికి తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ రాష్టాన్ని తాకట్టు పెట్టారని టిడిపి నేత యరపతినేని శ్రీనివాసరావు విమర్శించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి నీరు ఇచ్చే పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదని ఆవేదన వ్యక్తపరిచారు. రాష్ట్రంలో ఎవరు బయటకు వచ్చే పరిస్థితి లేదని, ర్యాలీ చేసిన, ప్రశ్నించిన కేసులు నమోదు చేస్తున్నారని యరపతినేని మండిపడ్డారు. జగన్ జైలు జీవితం అనుభవించారు కాబట్టి చంద్రబాబును కూడా జైలుకు పంపాలని ఆలోచన తప్ప ఏమి లేదన్నారు. చంద్రబాబుపై తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపారని, సాక్షి టీవీ, చానల్‌కు కోట్ల రూపాయలు యాడ్స్ రూపంలో ప్రభుత్వం ధనం దారాదత్తం చేస్తోందని ఆరోపించారు. అడుగడుగున టీడీపీ నాయకులపై కేసులు పెడుతున్నారని, అధికారం ఎవరికి శాశ్వతం కాదని.. 2024లో టీడీపీ అధికారంలోకి వస్తే మీ పరిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవాలన్నారు.