రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జగనన్న సురక్ష కార్యక్రమాన్ని పొదిలి మండల ప్రజలు వినియోగించుకోవాలని మార్కాపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి కోరారు. గురువారం పొదిలి స్థానిక ఇరిగేషన్ కార్యాలయం ఆవరణలో నాలుగవ సచివాలయ పరిధిలో మున్సిపల్ కమిషనర్ డినియోల్ జోసఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సురక్ష కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..... ఈ కార్యక్రమంలో మొత్తం ఏడు రకాల పరీక్షలు చేయనున్నట్లు ఆయన చెప్పారు. డాక్టర్లు ఇంటివద్దకే వచ్చి పరీక్షలు నిర్వహిస్తారని, వైద్యులకు సహకరించి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత వైద్యశాల డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.