జార్ఖండ్ లోని ధన్ బాద్ స్టేషన్ నుంచి న్యూఢిల్లీకి వెళ్తున్న సీల్దా-రాజధాని ఎక్స్ ప్రెస్ లో గురువారం ఒక ప్రయాణీకుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. వెంటనే స్పంధించిన పోలీసులు నిందితుడు హర్విందర్ సింగ్(41) ను అరెస్టు చేశారు. నిందితుడు మద్యం మత్తులో ఈ కాల్పులు జరిపినట్లు పోలీసులు భావిస్తున్నారు. కాగా అతడు కోచ్ అటెండర్ వాగ్వాదం జరగటం వలన కాల్పులు జరిపినట్లు ప్రాధమిక సమాచారం. ఈ సంఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు.