టీడీపీ అధినేత నారా చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు చేసిన చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ."రాజమండ్రి జైలులో ఉక్కపోత పెరిగితే చంద్రబాబు ఒక్కరికే కాదు అందరికీ సమస్యలు ఉంటాయి. జైలు ఏమైనా అత్తగారి ఇల్లా, ఏన్ అడుగుతున్నారు? చంద్రబాబుకు ఇంటి నుంచే భోజనం వస్తోంది. దాన్ని అధికారులు పరిశీలించిన తర్వాతే చంద్రబాబుకు ఇస్తున్నారు. అర్జంటుగా చంద్రబాబును బయటకు తీసుకురావాలనేదే టీడీపీ ప్లాన్" అని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.