లెబనన్ సరిహద్దు ప్రాంతమైన అల్మా అల్-సాహబ్లో ఇజ్రాయెల్- హెసొ బొల్లా మిలిటెంట్ల మధ్య జరిగిన పోరులో రాయిటర్స్ సంస్థకు చెందిన జర్నలిస్ట్ ఇస్సామ్ అబ్దల్లాహ్ మృతిచెందారు. ఈ ఘటనలో మరో ఆరుగురు జర్నలిస్టులు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై స్పందించిన ఇజ్రాయెల్ యూఎన్ ప్రతినిధి.. జర్నలిస్టులను చంపడం తమ ఉద్దేశం కాదని.. కానీ యుద్ధంలో ఇలాంటివి జరుగుతుంటాయని, దీనిపై దర్యాప్తు చేపడతామని అన్నారు.