బీహార్‌లోని బక్సర్ జిల్లాలో ఇటీవల ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కొద్ది రోజులకే మరో రైలు పట్టాలు తప్పింది. శుక్రవారం రాత్రి రఘునాథ్‌పూర్ స్టేషన్లో లూప్ లైన్లో ఇంజిన్ పట్టాలు తప్పింది. అయితే మరో రైలు బోగీలను లూప్లైన్కు తీసుకెళ్తున్న ఇంజిన్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. ట్రాక్‌లోని లోపం కారణంగా, ఆ ఇంజిన్ పట్టాలు తప్పినట్లు అధికారులు తేల్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.