సీఎం జగన్ అక్టోబర్ 19న పుట్టపర్తిలో పర్యటించనున్నారు. 'జగనన్న చేదోడు' పథకం నిధులను విడుదల చేయనున్నారు. ఈ పథకం కింద దర్జీలు, రజకులు, నాయీ బ్రహ్మణులకు రూ.10 వేల సాయం అందుతోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3.30 లక్షల మందికి దీని ద్వారా లబ్ధి చేకూరనుంది..గత మూడేళ్లలో ఈ పథకం కింద రూ.927.51 కోట్లు సాయం అందజేశారు.