ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ల దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వాటి దిగుమతికి లైసెన్స్ అవసరం లేదని తాజాగా పేర్కొంది. అయితే దిగుమతులను పర్యవేక్షిస్తామని కేంద్ర వాణిజ్య శాఖ స్పష్టం చేసింది. నవంబర్ 1 నుండి ల్యాప్‌టాప్స్, కంప్యూటర్లను లైసెన్సింగ్ విధానంలో ఉంచుతామని ఆగస్టులో కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఈ ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది.