విశాఖ నుంచి ఈస్టర్ ఆర్క్ కార్ ర్యాలీని తూర్పు నౌకాదళ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ రాజేష్ పెందాడ్కర్ జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ భారతదేశం గొప్ప సముద్ర వారసత్వం గురించి, దేశంలోని తూర్పు సముద్ర తెరవలోని కమ్యూనిటీ సంక్షేమ ఔట్రీచ్ కార్యకలాపాలపై అవగాహన కోసం నిర్వహించే ర్యాలీలో 28 మంది 23 నగరాల్లో ఏడు కార్లలో సుమారు 6000 కిలోమీటర్ల దూరం ప్రయాణించనున్నట్లు తెలిపారు.