73 ఏళ్ల చంద్రబాబుని అనారోగ్య కారణాలతో అంతమొందించే కుట్ర జరుగుతోందని టీడీపీ యువనేత నారా లోకేష్ వ్యాఖ్యానించారు. జైలులో చంద్రబాబు ఆరోగ్యం క్షీణించేలా చేసి ఆయనకి ప్రాణహాని ఉండేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని లోకేష్ అన్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై జైలు అధికారుల తీరు సందేహాస్పదంగా ఉంది. జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న చంద్రబాబుని ముద్దాయి అని హెల్త్ బులెటిన్లో పదే పదే పేర్కొనేందుకు పెట్టిన శ్రద్ధ ఆయన ఆరోగ్యం, భద్రతపై పెట్టడం లేదు. చంద్రబాబుకి ఏ హాని జరిగినా, సైకోజగన్ సర్కారు, జైలు అధికారులదే బాధ్యత అని నారా లోకేష్ అన్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై ఎందుకీ కక్ష? దోమలు ఎక్కువ ఉన్నాయన్నా పట్టించుకోలేదు. చన్నీళ్ళు ఇస్తున్నారనన్నా లెక్క చేయలేదు. సరిగా తిరగని ఫ్యాన్ పెట్టారు. చంద్రబాబు బరువు తగ్గిపోయారు. అలెర్జీ వచ్చింది, డీహైడ్రేషన్ వచ్చింది. అపరిశుభ్రంగా జైలు పరిసరాలు ఉన్నాయి. చంద్రబాబు జీవితం ప్రమాదంలో ఉంది’’ అని నారా లోకేష్ పేర్కొన్నారు.