నెల్లూరు జిల్లాలో ప్రతిపక్ష నేతలపై రాజకీయంగా వేధింపులు చేస్తున్నారని, ఇవి మంచి ఆలోచనలు కావని వైసీపీ ప్రభుత్వం ఆలోచించుకోవాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్ది డిమాండ్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.... ‘‘టీడీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కప్పిర శ్రీనివాసులు దంపతులకు ప్రాణహాని ఉంది. ఆయన ఇంటి ముందు అజ్ఞాత వ్యక్తులు సంచారిస్తున్నారు. గంజాయి అమ్ముతున్నాడంటూ కల్పితాలు సృష్టిస్తున్నారు. జిల్లా పోలీస్ అధికారులు చొరవ తీసుకోవాలి. గతంలో అనం వెంకటరమణ రెడ్ది చెప్పినా వినకపోవడంతో దాడి చేశారు. కప్పిర శ్రీనివాసులు వెంట నెల్లూరు జిల్లా టీడీపీ మొత్తం ఉంది. ఎలాంటి హాని జరిగినా దానికి ప్రభుత్వానిదే భాద్యత అని హెచ్చరించారు.