తండ్రిని కుమారుడు హత్య చేసిన ఘటన ప్రకాశం జిల్లాలో శనివారం చోటు చేసుకుంది. మార్కాపురం మండలం రాయవరంలో ఓ వ్యక్తి పెళ్లి చేయలేదనే కోపంతో తన తండ్రిని బయటకు తీసుకెళ్లి కత్తితో గొంతు కోసి హతమార్చాడు. అనంతరం తాను కూడా గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడగా.. అతన్ని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa