శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పేడాడ పరమేశ్వరరావును నియమిస్తూ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ సి.వేణుగోపాల్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. పరమేశ్వరరావు ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్‌పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. 2010లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా పరమేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో అభివృద్ధి, సుస్థిరపాలన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు తనవతు కృషి చేస్తానని తెలిపారు.