1933లో జిమ్మీ ఎలిస్ అనే వ్యక్తి న్యూయార్క్ లోని లార్క్ మోంట్ పబ్లిక్ లైబ్రరీ నుంచి 'యూత్ అండ్ టూ అదర్ స్టోరీస్' అనే పుస్తకాన్ని తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆయన బుక్ తిరిగివ్వలేకపోయారు. 1978లో కన్నుమూశారు. పుస్తకం సంగతీ అందరూ మర్చిపోయారు. తాజాగా ఆయన వస్తువుల్లో బుక్ను గుర్తించిన జిమ్మీ కుమార్తె, దాన్ని వెంటనే లైబ్రరీకి తిరిగిచ్చారు. ఆలస్యంగా ఇచ్చినందుకు లైబ్రరీ ఆమెకు 5 డాలర్ల ఫైన్ విధించడం గమనార్హం.