ఇజ్రాయెల్-పాలస్తీనా ఉద్రిక్తతల విషయంలో శాంతిని అభిలషిస్తూ యూఎన్ భద్రతా మండలి (యూఎన్ఎస్సీ) లో రష్యా తాజాగా ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఇరువర్గాలు కాల్పుల విరమణను పాటించాలని స్పష్టం చేసిన రష్యా, పౌరులపై హింసను, ఉగ్రవాదాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొంది. బందీలను విడిచిపెట్టి, పౌరుల సురక్షిత తరలింపునకు సహకరించాలని పిలుపునిచ్చింది. అయితే, హమాస్ పేరును మాస్కో ఇందులో పేర్కొనకపోవడం గమనార్హం.