గ్రూప్-2 అభ్యర్థి ప్రవల్లిక ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. 'ఇది ఆత్మహత్య కాదు. యువత ఆకాంక్షల హత్య. గత పదేళ్లలో BRS, BJP రాష్ట్రాన్ని నాశనం చేశాయి. మరికొన్ని నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఉద్యోగాల క్యాలెండర్ విడుదల చేస్తుంది. UPSC తరహాలో TSPSCని పునర్వ్యవస్థీకరిస్తుంది. ఏడాదిలోపు 2 లక్షల ప్రభుత్వ పోస్టులను భర్తీ చేస్తుంది. ఇది హామీ' అని తెలిపారు.