లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం నేరమని కడప జిల్లా, మదనపల్లె ఆర్డీవో మురళి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక సబ్‌కలెక్టరేట్‌లో డివిజనలోని అన్ని మండలాల ఐసీడీ ఎస్, తహసీల్దార్, పోలీసు అధికా రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ బాల్య వివాహాలు, చిన్న పిల్లలను లైంగిక వేధింపులు చట్టరీత్యా శిక్షార్హమన్నారు. వాటిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం అధికారులకు ఉందన్నారు. చిన్నారులకు గుడ్ టచ, బ్యాడ్ టచపై అవగాహన కల్పించాలన్నారు. ఎక్కడైనా ఇలాంటి నేరాలు జరి గితే వెంటనే ఐసీడీఎస్, పోలీసు అధికారులకు, టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన చేసి తెలపాలన్నారు.