ఇటీవల ఉత్తరాఖండ్ కుమాన్ ప్రాంతంలోని పార్వతీ కుండ్, జగేశ్వర్ దేవాలయాలను ప్రధాని మోదీ సందర్శించారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'ఉత్తరాఖండ్ లో తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశాలు ఏమున్నాయని ఎవరైనా అడిగితే పార్వతి కుండ్, జగేశ్వర్ ఆలయాల పేర్లను సూచిస్తాను. ఇక్కడి ప్రకృతి అందాలు, ఆధ్యాత్మికత మిమ్మల్ని కట్టిపడేస్తాయి' అని అన్నారు.