అమరావతి అసైన్డ్ భూముల కేసులో సీఐడీ సరికొత్త ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ కేసును రీ ఓపెన్ చేయాలని సీఐడీ హైకోర్టులో పిటిషన్ వేసింది. రాజధానిలో అసైన్డ్ భూముల కుంభకోణం జరిగిందని..ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదు మేరకు చంద్రబాబు, పొంగూరు నారాయణ మీద కేసు నమోదైంది. దీనిపై మార్చి 19న హైకోర్టు స్టే విధించగా.. కేసును కొట్టేయాలని నారాయణ పిటిషన్ వేశారు. విచారణ ముగిసిన తర్వాత తీర్పు ఈ నెల 16కు వాయిదా పడింది.