విశాఖ నుంచి పాలన మరికొంత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. మొదట దసరా నుంచే పాలన సాగించాలని భావించగా.. ఇటీవల పరిపాలన రాజధాని వసతులపై కమిటీ డిపార్ట్మెంట్ భవనాలు ఇంకా ఫైనలైజ్ చెయ్యలేదన్నారు. ఫైనల్ అయ్యాక సిఎం వస్తారని పేర్కొన్నారు. అటు.. TDP నాయకులు చెబుతున్నట్లు దొడ్డిదారిన వైజాగ్ రావాల్సిన అవసరం తమకు లేదన్నారు. రైట్ గా, రాయల్ గా తమ నాయకుడు విశాఖ వచ్చి పాలన సాగిస్తారన్నారు.