దసరా మహోత్సవాల సందర్భంగా దుర్గమ్మను దర్శించుకునేందుకు విచ్చేసే భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించాలని దేవదాయశాఖమంత్రి కొట్టు సత్యనారాయణ అధికారులకు ఆదేశించారు. లక్షలాది భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తున్న సందర్భంలో ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రసాదాల కౌంటర్లను అదనంగా ఏర్పాటుకు సంసిద్ధంగా ఉండాలన్నారు. అన్ని శాఖల సమన్వయంతో ఉత్పవాలను విజయవంతం చేయాలన్నారు. మూలా నక్షత్రం రోజున సీఎం జగన్మోహనరెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్న దృష్ట్యా తగిన బందోబస్తు ఏర్పాట్లను చేసుకోవాలన్నారు. వీఐపీ, వీవీఐపీలకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేయాలన్నారు.