పీసీసీ కార్యదర్శిగా పర్చూరుకు చెందిన తోట శివ నాగేశ్వరరావు నియమితులయ్యారు. జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం ప్రకటించిన నూతన కార్యవర్గంలో శివకు స్థానం లభించింది. గతంలో కేంద్ర బీడీ కార్మిక సంక్షేమ సంఘం సభ్యుడిగా శివ బాధ్యతలు నిర్వర్తించారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో పార్టీ బలం పెరిగిందని, రాష్ట్రంలో కూడా ఆ సూచనలు కనిపిస్తున్నాయని చెప్పారు.