ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని మార్కెట్ యార్డు సమీపంలో జాతీయ రహదారిపై పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు శనివారం తన సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేశారు. హెల్మెట్ ధరించకుండా సరైన పత్రాలు లేకుండా అతివేగంగా వెళుతున్న వాహన చోదకులకు ఆయన కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు మాట్లాడుతూ హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనంపై ప్రయాణించరాదని విజ్ఞప్తి చేశారు.