దేశంలో రాజకీయ దురుద్దేశంతోనే ఐటీ దాడులు జరుగుతున్నాయని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పేర్కొన్నారు. బెంగళూరు ఐటీ దాడుల వెనుక కచ్చితంగా రాజకీయ కోణం ఉందన్నారు. కేవలం కర్ణాటకలోనే కాకుండా ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఐటీ దాడులు సర్వసాధారణంగా మారాయని తెలిపారు. శాసనసభ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలకు కర్ణాటక నుంచే నిధులు తరలివెళుతున్నాయన్న బీజేపీ నేత అశ్వత్థనారాయణ వ్యాఖ్యలను ఖండించారు.