దేశంలో పదేళ్లుగా బెయిల్పై ఉన్న నాయకుడు సీఎం జగన్ మాత్రమేనని మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు విమర్శించారు. చంద్రబాబును జైలులో పెట్టి, ఆయన చేసిన నేరం ఏంటో నిరూపించలేకపోయారని ఆరోపించారు. ఆయన అనారోగ్యంతో ఉన్నా ఆస్పత్రికి తీసుకెళ్లకపోవడం బుద్ధి లేని చర్య అని మండిపడ్డారు. చంద్రబాబు బరువు పెరిగారంటూ వైసీపీ నేతలు వెటకారం చేస్తున్నారని దుయ్యబట్టారు.