ఇజ్రాయెల్ మరియు మిలిటెంట్ గ్రూప్ హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నగరానికి బయలుదేరే షెడ్యూల్డ్ విమానాల నిలిపివేతను అక్టోబర్ 18 వరకు పొడిగించినట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది. అంతకుముందు అక్టోబర్ 14 వరకు సేవలను నిలిపివేసింది. అవసరాలను బట్టి భారతీయులను తిరిగి తీసుకురావడానికి క్యారియర్ చార్టర్డ్ విమానాలను నడుపుతామని తెలిపింది.